
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్.. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 16న ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు.
లక్నోతో మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు పయనమయ్యాడు. అక్కడ కమ్మిన్స్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అద్బుతాలు సృష్టిస్తోంది.
ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ ఏడింట విజయం సాధించింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా కమ్మిన్స్ ఆకట్టుకుంటున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు.
Pat Cummins enjoying His Vacation in Dubai! pic.twitter.com/xgSbabtyYF
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 10, 2024