సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.
చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్‌ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపింది.
భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు.
"బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.
జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్‌లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment