బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ది కీలక పాత్ర.
సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు.
కమ్మిన్స్ అరుదైన ఘనత..
ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.
కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment