IPL 2025: అంద‌రూ ఇండియ‌న్సే.. ప్యాట్ క‌మ్మిన్స్ ఒక్క‌డే | Pat Cummins Remains The Only Overseas Player To Captain Side In IPL 2025, Check Other Teams Captains | Sakshi
Sakshi News home page

IPL 2025 Teams And Captains: అంద‌రూ ఇండియ‌న్సే.. ప్యాట్ క‌మ్మిన్స్ ఒక్క‌డే

Published Fri, Mar 14 2025 12:57 PM | Last Updated on Fri, Mar 14 2025 1:25 PM

Pat Cummins only overseas player to captain side in IPL 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కి రంగం సిద్ధమైంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది.  ఈ ఏడాది సీజన్ కోసం మొత్తం పది ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌ల వివరాలను ప్రకటించాయి. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఫ్రాంచైజీలు తమ సారధులను ఖారారు చేయగా.. ఢిల్లీ ‍ క్యాపిటల్స్‌ ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ పేరును ప్రకటించడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

కమ్మిన్స్ ఒక్కడే..
కాగా ఐపీఎల్‌-2025లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్‌లో మొత్తం పది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. అందులో తొమ్మిది జట్ల కెప్టెన్‌లగా భారత్ ఆటగాళ్లు వ్యవహరించనుండగా.. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే విదేశీ ఆటగాడు సారథిగా ఉండనున్నాడు. 

టోర్నమెంట్ మొత్తం ఎడిషన్‌లో ఏకైక విదేశీ కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. గతసీజన్‌లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌లకు విదేశీ కెప్టెన్‌లు ఉన్నారు. కాగా కమ్మిన్స్ గత సీజన్​‍లో కూడా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్గా వ్యవహరించాడు.

అతడి సారథ్యంలో సన్‌రైజర్స్ అద్బుతాలు సృష్టించింది. అయితే అనూహ్యంగా ఆఖరి ​మెట్టుపై బోల్తా పడింది. గత కొన్ని రోజులగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ ఐపీఎల్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అతడు త్వరలోనే సన్‌రైజర్స్ బృందంలో చేరనున్నాడు.

ఐపీఎల్‌-2025లో కెప్టెన్‌లు వీరే..
చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్ 
ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్ 
గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్ 
కోల్‌కతా నైట్ రైడర్స్- అజింక్య రహానే 
లక్నో సూపర్ జెయింట్స్- రిషబ్ పంత్ 
ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్య
పంజాబ్ కింగ్స్- శ్రేయాస్ అయ్యర్
రాజస్థాన్ రాయల్స్- సంజు సామ్సన్ 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్ 
సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమ్మిన్స్
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement