ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఖారారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా వేలానికి ముందు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కల్పించింది.
ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది.
నాలుగు, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనకుంటే తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని మొత్తం 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను దాదాపు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
మార్క్‌రమ్‌కు నో ఛాన్స్?
ఇక ఐపీఎల్-2024 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తాము అంటిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను ఖారారు చేసినట్లు సమాచారం. రెండు సీజన్లలో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రోటీస్ స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్క్‌రమ్‌ను వేలంలోకి విడిచిపెట్టాలని ఎస్ఆర్‌హెచ్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఇక ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(రూ.18 కోట్లు) తొలి ఆటగాటిగా రిటెన్షన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ ఈ ఏడాది సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలో కూడా ప్యాట్ అదరగొట్టాడు.
కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు అతడిని ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ చేశాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(రూ.14 కోట్లు) రెండో ప్లేయర్‌గా, మూడో ఆటగాడిగా అభిషేక్ శర్మ(రూ.11 కోట్లు)లను ఎస్ఆర్‌హెచ్ అంటిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా నాలుగో ఆటగాడిగా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్(రూ.18 కోట్లు), ఐదో ప్లేయర్‌గా హెన్రిస్ క్లాసెన్(రూ.11 కోట్లు)ను రిటైన్ చేసుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తుందంట. ఇక ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలని కావ్యా మారన్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment