
సిడ్నీ: ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడు. అతని భార్య రెండో కాన్పు సమయంలోనే ఆ టూర్ ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకునే అవకాశముందని చెప్పాడు. గతేడాది భారత్ పర్యటనలో ఉండగా కమిన్స్ మాతృమూర్తి మృతి చెందడంతో టూర్ మధ్యలోనే అతను తిరుగుముఖం పట్టాడు. అప్పటి నుంచి తన జీవితంలో కుటుంబ ప్రాధామ్యాలు మారాయని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నెలాఖర్లో లంక పర్యటనకు బయలుదేరనున్న ఆసీస్ అక్కడ రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే రెండో జట్టు ఈ సిరీస్ ఫలితంతోనే ఖరారవుతుంది.
జనవరి 29 నుంచి తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలోని ఆ్రస్టేలియాకు అనుభవజు్ఞడైన స్టీవ్ స్మిత్ లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌లలో ఒకరు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.