స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌తో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023 విజయం తర్వాత కమ్మిన్స్ వన్డేల్లో తొలిసారి ఆడనున్నాడు.
పాట్ కమిన్స్‌తో పాటు వెటరన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
గత కొంత కాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న వీరిద్దరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ ఆటగాళ్లు జాక్ ఫ్రెసర్ ముక్‌గర్క్, కూపర్ కొన్నోలీలు పాక్ సిరీస్‌కు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. నవంబర్ 4న మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో వన్డే నవంబర్ 8న ఆడిలైడ్‌లో రెండో వన్డే, నవంబర్ 10న పెర్త్‌లో ఆఖరి వన్డే జరగనుంది.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిష్, జంపా
Comments
Please login to add a commentAdd a comment