టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్‌లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
సొంతమైదానం చెన్నైలోని చెపాక్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్‌లో మొదలుకానుంది.
నాలుగు వికెట్లు తీస్తే..
ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు.
ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్‌లో హాజిల్‌వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 51
రవిచంద్రన్ అశ్విన్‌ఇండియా)-48
ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48
క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43
నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.
చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment