టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో ఇంత వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఘనత నమోదు చేశాడు. కాగా సొంతగడ్డపై భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు
ఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో అశూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్‌లో రెండో టెస్టు సందర్భంగా అశూ సెంచరీ(113) చేయడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా సీజన్‌లో ఆడిన తొలి పది మ్యాచ్‌లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు.
డబ్ల్యూటీసీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వికెట్స్ బౌలర్ అశూ
2019-21 సీజన్- 14 మ్యాచ్‌లలో 71 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 7/145
2021-23 సీజన్- 13 మ్యాచ్‌లలో 61 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 6/91
2023-25 సీజన్- 10* మ్యాచ్‌లలోనే 50* వికెట్లు()-అత్యుత్తమ గణాంకాలు 7/71.
ధనాధన్
ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 26/2(11) ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ను అశూ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్ హక్‌ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్ దీప్ షాద్‌మన్ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి..బజ్‌బాల్ క్రికెట్‌తో గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment