
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ అదుకున్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం స్మిత్ ఔటైనప్పటికీ.. లబుషేన్ మాత్రం తన పని తను చేసుకుపోయాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్‌స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు.
చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment