
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 253 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మలాన్(50) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్‌స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు.
చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు