ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌.. అసీస్‌ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోకు పిలుపు | Mahli Beardman earns maiden call-up to Australias ODI squad | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌.. అసీస్‌ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోకు పిలుపు

Published Mon, Sep 16 2024 9:44 PM | Last Updated on Tue, Sep 17 2024 9:40 AM

Mahli Beardman earns maiden call-up to Australias ODI squad

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను సంయుక్తంగా పంచుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. అయితే సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

టీ20 సిరీస్ స‌మ‌యంలో గాయ‌ప‌డిన పేస‌ర్ గ్జావియ‌ర్ బార్టెలెట్ వన్డే సిరీస్‌కు కూడా దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డి స్ధానాన్ని అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో, ఫాస్ట్ బౌల‌ర్ మ‌హిల్ బియ‌ర్డ్‌మ‌న్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భ‌ర్తీ చేసింది. 

ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమ‌వారం వెల్ల‌డించింది. కాగా అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్‌-2024 విజేత‌గా ఆసీస్ నిల‌వ‌డంతో బియ‌ర్డ్‌మ‌న్ కీల‌క పాత్ర పోషించాడు. ఫైన‌ల్లో టీమిండియాపై మూడు వికెట్ల చెల‌రేగాడు. 

ఓవ‌రాల్‌గా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి పది వికెట్ల‌తో స‌త్తాచాటాడు. బియ‌ర్డ్‌మ‌న్ గంట‌కు 140 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. ఈ క్ర‌మంలోనే సెల‌క్ట‌ర్ల దృష్టిలో ఈ యువ సంచలనం పడ్డాడు. 

ఆస్ట్రేలియా జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్‌), కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌), ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా 
ట్రావెలింగ్ రిజర్వ్: మహ్లీ బార్డ్‌మాన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement