మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్ 11) జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు (జేకబ్ బేథెల్, జేమీ ఓవర్టన్, జోర్డన్ కాక్స్) టీ20 అరంగేట్రం చేయనున్నారు.
రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్ వేదికగా రేపటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.
ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..
సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)
సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)
సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)
సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)
సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)
సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్
సెప్టెంబర్ 27- లండన్
సెప్టెంబర్ 29- బ్రిస్టల్
Comments
Please login to add a commentAdd a comment