
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్‌తో మూడు టీ20లు.. ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు మరో భారీ షాక్ తగిలింది.
ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కాలి పిక్క కండరాల గాయం కారణంగా స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో హాజిల్‌వుడ్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా హాజిల్‌వుడ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని హాజిల్‌వుడ్‌కు మరింత విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక హాజిల్‌వుడ్ స్ధానాన్ని రీలే మెరిడిత్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అతడు చివరగా 2021లో ఆసీస్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్‌లో మెరిడిత్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.
కాగా ఈ యూకే టూర్‌కు ఇప్పటికే యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా దూరమయ్యాడు. ఇక ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్‌తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.
స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, మెరిడిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
Comments
Please login to add a commentAdd a comment