
పెర్త్: ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ఓడిపోయి... ఆటతీరు పరంగానూ విమర్శలెదుర్కొంటున్న ఇంగ్లండ్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పెర్త్‌లోని ఓ బార్‌లో తప్ప తాగి.. సీనియర్ ఆటగాడు అండర్సన్‌పై మద్యం కుమ్మరించినందుకు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌పై జట్టు యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వాస్తవానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో శనివారం ప్రారంభమైన టూర్ మ్యాచ్‌లో 23 ఏళ్ల డకెట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సి ఉంది.
కానీ బార్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో అతడిని పక్కకు పెట్టారు. డకెట్ ఇంగ్లండ్ తరఫున నాలుగు టెస్టులు ఆడాడు. గతేడాది భారత్‌లో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. కీలక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సెప్టెంబరులో బ్రిస్టల్ నైట్ క్లబ్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment