యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాల్ కాలింగ్‌వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా హెడ్ కోచ్ పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తదుపరి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నాడు. కాగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్.. ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్‌గా వార్న్ ఉన్నాడు. 'ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నాను.
జట్టును విజయ పథంలో నడిపించగలను అని అనుకుంటున్నాను. ఇంగ్లండ్‌లో చాలా మంది అత్యత్తుమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రాథమికంగా జట్టులో కొన్ని మార్పులను చేస్తే చాలు. అదే విధంగా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు, ఫీల్డర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు అంతగా రాణించలేకపోతున్నారు' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ కోచ్ పదవికోసం ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు.
చదవండి: Prasidh Krishna: బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే
Comments
Please login to add a commentAdd a comment