Chris Silverwood
-
T20 World Cup 2024: గ్రూప్ దశలో నిష్క్రమణ.. హెడ్ కోచ్ పదవికి రాజీనామా
శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు సిల్వర్‌వుడ్ ప్రకటించాడు. సిల్వర్‌వుడ్ రాజీనామాను శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ధృవీకరించింది. శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా మహేళ జయవర్దనే రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే సిల్వర్‌వుడ్ కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీ20 వరల్డ్‌కప్-2024 శ్రీలంక చెత్త ప్రదర్శన కారణంగానే వీరిద్దరు రాజీనామాలు చేసినట్లు తెలుస్తుంది. 49 ఏళ్ల సిల్వర్‌వుడ్ 2022 ఏప్రిల్‌లో శ్రీలంక హెడ్ కోచ్‌గా నియమితుడై రెండేళ్లకుపైగా జట్టుతో పని చేశాడు. కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి దశకు చేరింది. ఇప్పటికే ఓ సెమీఫైనల్ పూర్తి కాగా.. రెండోది ఇవాళ (జూన్ 27) రాత్రి జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
ఇంగ్లండ్‌ను భ్రష్ఠుపట్టించిన కోచ్‌ను ఏరికోరి ఎన్నుకున్న శ్రీలంక
Chris Silverwood: ఏకపక్ష నిర్ణయాలతో ఇంగ్లండ్ క్రికెట్‌ను భ్రష్ఠుపట్టించిన ఆ జట్టు మాజీ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ను క్రికెట్ శ్రీలంక (ఎస్ఎల్సీ) ఏరికోరి హెడ్ కోచ్‌గా నియమించుకుంది. సిల్వర్‌వుడ్ హయాంలో ఇంగ్లండ్.. యాషెస్ 2021-22లో ఆసీస్ చేతిలో దారుణ పరాభవాన్ని (4-0) ఎదుర్కొనడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా ఖంగుతింది. అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగిన ఇంగ్లండ్.. సిల్వర్‌వుడ్ హాయాంలో పసికూనల చేతిలో కూడా ఓటమిపాలైంది. ఇంతటి బ్యాడ్ ట్రాక్ రికార్డు కలిగిన సిల్వర్‌వుడ్‌ను తాజాగా శ్రీలంక తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. మిక్కీ ఆర్ధర్ రాజీనామా అనంతరం ఏడాది కాలంగా హెడ్ కోచ్ లేక నెట్టుకొచ్చిన శ్రీలంక సిల్వర్‌వుడ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి సిల్వర్‌వుడ్ లంక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఎస్ఎల్సీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సిల్వర్‌వుడ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడని పేర్కొంది. సిల్వర్‌వుడ్ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసింది. సిల్వర్‌వుడ్ లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ మార్గదర్శకత్వంలో లంక క్రికెట్ పూర్వవైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. చదవండి: పాకిస్థాన్ మొదలు పెడితే మరో రెండు దేశాలు అదే పాట పాడుతున్నాయి..! -
'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా'
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాల్ కాలింగ్‌వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా హెడ్ కోచ్ పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తదుపరి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నాడు. కాగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్.. ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్‌గా వార్న్ ఉన్నాడు. 'ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నాను. జట్టును విజయ పథంలో నడిపించగలను అని అనుకుంటున్నాను. ఇంగ్లండ్‌లో చాలా మంది అత్యత్తుమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రాథమికంగా జట్టులో కొన్ని మార్పులను చేస్తే చాలు. అదే విధంగా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు, ఫీల్డర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు అంతగా రాణించలేకపోతున్నారు' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ కోచ్ పదవికోసం ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు. చదవండి: Prasidh Krishna: బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే -
ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఘోర పరాభవం.. హెడ్‌కోచ్‌పై వేటు.. మాజీ కెప్టెన్ ఏమో!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఇక సిల్వర్‌వుడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకంగా వ్యవహరించిన మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తన పదవి నుంచి దిగిపోయిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో జో రూట్ బృందం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 0-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుని అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మేనేజ్మెంట్ తీరును కూడా పలువురు దిగ్గజాలు విమర్శించారు. ఈ క్రమంలో ఎండీ, హెడ్‌కోచ్ తమ పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. ఈ సందర్భంగా సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ... ‘‘ఇంగ్లండ్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేటి ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి ప్రయాణించడం నాకు గర్వకారణం. గడిచిన రెండేళ్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే రూటీ(టెస్టు కెప్టెన్ జో రూట్), మోర్గ్స్(పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్)తో కలిసి పనిచేయడం... కఠిన సవాళ్లను ఎదుర్కోవడం పట్ల గర్వంగా ఉంది. కోచ్‌గా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఎండీ ఆష్లే స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కేర్ టేకర్ కోచ్‌ను అతడు నియమించనున్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్ Just put out the one mitt - and it stuck! #Ashes pic.twitter.com/10yK7Cadc3 — cricket.com.au (@cricketcomau) January 16, 2022 Chris Silverwood has left his role as England Men’s Head Coach. We wish him all the best for the future. — England Cricket (@englandcricket) February 3, 2022 -
ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్‌కు కరోనా..
ఆస్ట్రేలియాతో బుధవారం సిడ్నీలో మొదలయ్యే యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తమ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ లేకుండానే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బరిలోకి దిగనుంది. తన కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా రావడంతో గత నెల 30 నుంచే సిల్వర్‌వుడ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కాగా ఆదివారం సిల్వర్‌వుడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈనెల 8 వరకు ఆయన ఐసోలేషన్‌లో ఉంటారు. సిల్వర్‌వుడ్ గైర్హాజరీలో అసిస్టెంట్ కోచ్ గ్రాహమ్ థోర్ప్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆదే విధంగా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావియస్ హెడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ టెస్ట్‌కు దూరమయ్యాడు. కాగా ఇప్పటికే 3-0తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. చదవండి: ఆ విషయం విని షాక్‌కు గురయ్యాను: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ -
ఆ క్రెడిట్ టీమిండియాదే: ఇంగ్లండ్ కోచ్ ప్రశంసలు
లండన్: నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టుకు పట్టుదలగా పోరాడటం వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించాడు. ఓవల్ టెస్టులో కోహ్లి సేనపై ఒత్తిడి పెంచితే ఫలితం వేరేలా ఉండేదని, కానీ వాళ్లు తమకు ఛాన్స్ ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. తద్వారా 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో క్రిస్ సిల్వర్‌వుడ్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే... తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే టీమిండియాను కట్టడి చేశాం. రెండో ఇన్నింగ్స్‌లో మేం బాగానే బ్యాటింగ్ చేస్తున్నామనుకునే క్రమంలో తడబడ్డాం. భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాం. క్రెడిట్ అంతా టీమిండియాకే దక్కుతుంది. ఎందుకంటే.. వారికి ఎలా పోరాడాలో.. పోగొట్టుకున్న చోట ఎలా వెతుక్కోవాలో వారికి బాగా తెలుసు. ఓటమి గురించి మాట్లాడే క్రమంలో డ్రెస్సింగ్‌రూంలో ఈ విషయాలను మేం చర్చింకున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా బుమ్రా అద్భుతమైన పేస్ బౌలింగ్, శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం -
ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..?
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ బుమ్రాను టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ పేసర్లు అతిగా(వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని) ప్రవర్తించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో క్రికెట్ విలువలకు తూట్లు పొడిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను ఆ జట్టు కోచ్ సిల్వర్ వుడ్ మందలించకపోవడంపై మండిపడ్డాడు. మైదానంలో కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుందని పేర్కొన్నాడు. డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సిందని తెలిపాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే, నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఇలాగే సందేశాలు పంపేవాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ఓటమికి కోచ్ సిల్వర్‌వుడ్ బాధ్యత లేమి మరో కారణమని ఆరోపించాడు. ఏదిఏమైనా బుమ్రాను టార్గెట్ చేసి మ్యాచ్‌ను గాలికొదిలేసిన రూట్ సేన తగిన మూల్యమే చెల్లించుకుందన్నాడు. ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసిన వాన్.. బుమ్రా విషయంలో ఇంగ్లండ్ అతి ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు 20 నిమిషాల ఆటనే(బుమ్రాను టార్గెట్ చేయడం) ఇంగ్లండ్ కొంపముంచిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్.. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నాడు. దీన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కోచ్ సహా ఇంగ్లండ్ బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడని ప్రశంశించిన వాన్.. భారత్ బృందాన్ని ఆకాశానికెత్తాడు. కాగా, లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఈనెల 25న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. చదవండి: మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి.. -
తగ్గేదేలే.. టీమిండియాకు ధీటుగా బదులిస్తాం: ఇంగ్లండ్ కోచ్
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. చివరిరోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు ఎక్కువయ్యాయని, అయితే వీటిని మ్యాచ్ గెలిచేందుకు ఉపయోగించుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఆండర్సన్‌ను రెచ్చగొడుతూ ముందుగా టీమిండియా ఆటగాళ్లే మాటల యుద్ధానికి తెరలేపారని, అందుకు తాము కూడా తగు రీతిలో బదులు ఇవ్వాల్సి వచ్చిందని సొంత జట్టు ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో తాము గెలవాల్సింది, కానీ.. బుమ్రా-షమీ ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని వెల్లడించాడు. టీమిండియా ఓటమి తప్పించుకునే ఉద్దేశంతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్లోని అసలైన మజాను ఆస్వాదించామని తెలిపాడు. ఏదిఏమైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం లేదని, మూడో టెస్ట్‌లో టీమిండియాపై కచ్చితంగా పైచేయి సాధించి లెక్క సరిచేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కాగా, సోమవారం ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా ఆగస్ట్ 25న ప్రారంభంకానుంది. చదవండి: నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త -
రొటేషన్‌లో ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్‌కు విశ్రాంతి
లండన్: న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తర్వాత ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్ విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో ఇప్పటిదాకా తమ క్రికెటర్లకు మాత్రమే రొటేషన్ పద్ధతిని పాటిస్తూ వస్తోన్న ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇకపై కోచ్‌లకు కూడా ఆ అవకాశం కల్పించనున్నట్లు స్పష్టమైంది. నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకోనున్న వుడ్... భారత్‌తో ఆగస్టు 4న ఆరంభమయ్యే టెస్టు సిరీస్ నాటికి జట్టుతో కలుస్తాడు. సిల్వర్‌వుడ్ గైర్హాజరీలో శ్రీలంక, పాకిస్తాన్లతో జరిగే పరిమిత ఓవర్ల్ల సిరీస్‌లకు అసిస్టెంట్ కోచ్‌లు కాలింగ్‌వుడ్, థోర్ప్ సిరీస్‌కు ఒకరు చొప్పున ప్రధాన కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.