
లండన్: న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తర్వాత ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్ విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో ఇప్పటిదాకా తమ క్రికెటర్లకు మాత్రమే రొటేషన్ పద్ధతిని పాటిస్తూ వస్తోన్న ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇకపై కోచ్‌లకు కూడా ఆ అవకాశం కల్పించనున్నట్లు స్పష్టమైంది.
నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకోనున్న వుడ్... భారత్‌తో ఆగస్టు 4న ఆరంభమయ్యే టెస్టు సిరీస్ నాటికి జట్టుతో కలుస్తాడు. సిల్వర్‌వుడ్ గైర్హాజరీలో శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగే పరిమిత ఓవర్ల్ల సిరీస్‌లకు అసిస్టెంట్ కోచ్‌లు కాలింగ్‌వుడ్, థోర్ప్ సిరీస్‌కు ఒకరు చొప్పున ప్రధాన కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment