
ఆస్ట్రేలియాతో బుధవారం సిడ్నీలో మొదలయ్యే యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తమ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ లేకుండానే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బరిలోకి దిగనుంది. తన కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా రావడంతో గత నెల 30 నుంచే సిల్వర్‌వుడ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.
కాగా ఆదివారం సిల్వర్‌వుడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈనెల 8 వరకు ఆయన ఐసోలేషన్‌లో ఉంటారు. సిల్వర్‌వుడ్ గైర్హాజరీలో అసిస్టెంట్ కోచ్ గ్రాహమ్ థోర్ప్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆదే విధంగా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావియస్ హెడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ టెస్ట్‌కు దూరమయ్యాడు. కాగా ఇప్పటికే 3-0తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.
చదవండి: ఆ విషయం విని షాక్‌కు గురయ్యాను: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment