యాషెస్ సిరీస్-2023లో ఆఖరి (ఐదవది) టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లు ఆసీస్ ఆటగాళ్లను వణికిస్తున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
Chris Woakes gets David Warner early on Day 5.
— CricTracker (@Cricketracker) July 31, 2023
📸: Sony LIV pic.twitter.com/yvj0U7KmiE
ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక 4వ ఓవర్ రెండో బంతికి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ పెవిలియన్‌కు చేరగా.. ఆ వెంటనే ఆరో ఓవర్ రెండో బంతికి అదే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 49వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసీస్ 34 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి (169/3) బిక్కుబిక్కుమంటుంది.
Chris Woakes is in the act for England.pic.twitter.com/UlekQeEhqX
— CricTracker (@Cricketracker) July 31, 2023
లబూషేన్ ఔటయ్యాక కాస్త దూకుడు పెంచిన ఆసీస్ వేగంగా పరుగులు చేస్తూనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్టీవ్ స్మిత్ (35 బంతుల్లో 21; 4 ఫోర్లు, ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 57 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 210/3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. అదే ఇంగ్లండ్ విజయం సాధించలాంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. తొలి సెషన్‌లో ఇప్పటివరకు 19 ఓవర్లు జరిగాయి. ఈ రోజు ఇంకా 71 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment