Ashes 2023: England all out for 283 in 5th Test - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 283 ఆలౌట్‌ 

Published Fri, Jul 28 2023 4:56 AM | Last Updated on Fri, Jul 28 2023 11:10 AM

England 283 all out - Sakshi

లండన్‌: ఆ్రస్టేలియాతో గురువారం మొదలైన యాషెస్‌ సిరీస్‌ చివరిదైన ఐదో టెస్టును ఇంగ్లండ్‌ అదే దూకుడుతో ప్రారంభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 54.4 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ జట్టులో ఓపెనర్లు డకెట్‌ (41; 3 ఫోర్లు), జాక్‌ క్రాలీ (22; 3 ఫోర్లు), మొయిన్‌ అలీ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (91 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ స్టార్క్‌ (4/82) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ కోల్పోయి 61 పరుగులు చేసింది. వార్నర్‌ (24) అవుటయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement