Ashes 2023 Eng Vs Aus: Australia All Out For 295 On Day Two Of 5th Test, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

Ashes 5th Test ENG Vs AUS: రాణించిన స్మిత్‌.. 295 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

Published Sat, Jul 29 2023 2:33 AM | Last Updated on Sat, Jul 29 2023 8:59 AM

Australia 295 all out - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ‘యాషెస్‌’ సిరీస్‌ ఆఖరి ఐదో టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్‌ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్‌ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కమిన్స్‌ (36; 4 ఫోర్లు), మర్ఫీ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు వోక్స్‌ 3 వికెట్లు... బ్రాడ్, వుడ్, రూట్‌ తలా 2 వికెట్లు తీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement