శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు సిల్వర్‌వుడ్ ప్రకటించాడు. సిల్వర్‌వుడ్ రాజీనామాను శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ధృవీకరించింది. శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా మహేళ జయవర్దనే రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే సిల్వర్‌వుడ్ కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీ20 వరల్డ్‌కప్-2024 శ్రీలంక చెత్త ప్రదర్శన కారణంగానే వీరిద్దరు రాజీనామాలు చేసినట్లు తెలుస్తుంది. 49 ఏళ్ల సిల్వర్‌వుడ్ 2022 ఏప్రిల్‌లో శ్రీలంక హెడ్ కోచ్‌గా నియమితుడై రెండేళ్లకుపైగా జట్టుతో పని చేశాడు. కాగా, యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి దశకు చేరింది. ఇప్పటికే ఓ సెమీఫైనల్ పూర్తి కాగా.. రెండోది ఇవాళ (జూన్ 27) రాత్రి జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు పోటీపడనున్నాయి.
ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment