
Chris Silverwood: ఏకపక్ష నిర్ణయాలతో ఇంగ్లండ్ క్రికెట్‌ను భ్రష్ఠుపట్టించిన ఆ జట్టు మాజీ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ను క్రికెట్ శ్రీలంక (ఎస్ఎల్సీ) ఏరికోరి హెడ్ కోచ్‌గా నియమించుకుంది. సిల్వర్‌వుడ్ హయాంలో ఇంగ్లండ్.. యాషెస్ 2021-22లో ఆసీస్ చేతిలో దారుణ పరాభవాన్ని (4-0) ఎదుర్కొనడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా ఖంగుతింది.
అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగిన ఇంగ్లండ్.. సిల్వర్‌వుడ్ హాయాంలో పసికూనల చేతిలో కూడా ఓటమిపాలైంది. ఇంతటి బ్యాడ్ ట్రాక్ రికార్డు కలిగిన సిల్వర్‌వుడ్‌ను తాజాగా శ్రీలంక తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది.
మిక్కీ ఆర్ధర్ రాజీనామా అనంతరం ఏడాది కాలంగా హెడ్ కోచ్ లేక నెట్టుకొచ్చిన శ్రీలంక సిల్వర్‌వుడ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి సిల్వర్‌వుడ్ లంక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఎస్ఎల్సీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సిల్వర్‌వుడ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడని పేర్కొంది. సిల్వర్‌వుడ్ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసింది. సిల్వర్‌వుడ్ లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ మార్గదర్శకత్వంలో లంక క్రికెట్ పూర్వవైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
చదవండి: పాకిస్థాన్ మొదలు పెడితే మరో రెండు దేశాలు అదే పాట పాడుతున్నాయి..!
Comments
Please login to add a commentAdd a comment