Sri Lanka chief coach
-
T20 World Cup 2024: గ్రూప్ దశలో నిష్క్రమణ.. హెడ్ కోచ్ పదవికి రాజీనామా
శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు సిల్వర్‌వుడ్ ప్రకటించాడు. సిల్వర్‌వుడ్ రాజీనామాను శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ధృవీకరించింది. శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా మహేళ జయవర్దనే రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే సిల్వర్‌వుడ్ కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీ20 వరల్డ్‌కప్-2024 శ్రీలంక చెత్త ప్రదర్శన కారణంగానే వీరిద్దరు రాజీనామాలు చేసినట్లు తెలుస్తుంది. 49 ఏళ్ల సిల్వర్‌వుడ్ 2022 ఏప్రిల్‌లో శ్రీలంక హెడ్ కోచ్‌గా నియమితుడై రెండేళ్లకుపైగా జట్టుతో పని చేశాడు. కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి దశకు చేరింది. ఇప్పటికే ఓ సెమీఫైనల్ పూర్తి కాగా.. రెండోది ఇవాళ (జూన్ 27) రాత్రి జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
ఇంగ్లండ్‌ను భ్రష్ఠుపట్టించిన కోచ్‌ను ఏరికోరి ఎన్నుకున్న శ్రీలంక
Chris Silverwood: ఏకపక్ష నిర్ణయాలతో ఇంగ్లండ్ క్రికెట్‌ను భ్రష్ఠుపట్టించిన ఆ జట్టు మాజీ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ను క్రికెట్ శ్రీలంక (ఎస్ఎల్సీ) ఏరికోరి హెడ్ కోచ్‌గా నియమించుకుంది. సిల్వర్‌వుడ్ హయాంలో ఇంగ్లండ్.. యాషెస్ 2021-22లో ఆసీస్ చేతిలో దారుణ పరాభవాన్ని (4-0) ఎదుర్కొనడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా ఖంగుతింది. అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగిన ఇంగ్లండ్.. సిల్వర్‌వుడ్ హాయాంలో పసికూనల చేతిలో కూడా ఓటమిపాలైంది. ఇంతటి బ్యాడ్ ట్రాక్ రికార్డు కలిగిన సిల్వర్‌వుడ్‌ను తాజాగా శ్రీలంక తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. మిక్కీ ఆర్ధర్ రాజీనామా అనంతరం ఏడాది కాలంగా హెడ్ కోచ్ లేక నెట్టుకొచ్చిన శ్రీలంక సిల్వర్‌వుడ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి సిల్వర్‌వుడ్ లంక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఎస్ఎల్సీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సిల్వర్‌వుడ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడని పేర్కొంది. సిల్వర్‌వుడ్ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసింది. సిల్వర్‌వుడ్ లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ మార్గదర్శకత్వంలో లంక క్రికెట్ పూర్వవైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. చదవండి: పాకిస్థాన్ మొదలు పెడితే మరో రెండు దేశాలు అదే పాట పాడుతున్నాయి..! -
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
కొలంబో : భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. గత మూ డు నెలల్లో లంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆ మోదించారు. బంగ్లాదేశ్‌కు సేవలందిస్తున్న చండికా హతురసింఘేను కొత్త కోచ్‌గా నియమించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. కోచ్ చండికా ఆధ్వర్యంలో బంగ్లా జట్టు ప్రపంచకప్ క్వార్టర్స్‌కు వెళ్లడమే కాకుం డా పాక్, భారత్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లోనూ దుమ్ము రేపిన విషయం తెలిసిందే.