కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
కొలంబో : భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. గత మూ డు నెలల్లో లంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆ మోదించారు. బంగ్లాదేశ్‌కు సేవలందిస్తున్న చండికా హతురసింఘేను కొత్త కోచ్‌గా నియమించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. కోచ్ చండికా ఆధ్వర్యంలో బంగ్లా జట్టు ప్రపంచకప్ క్వార్టర్స్‌కు వెళ్లడమే కాకుం డా పాక్, భారత్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లోనూ దుమ్ము రేపిన విషయం తెలిసిందే.