మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.
కాగా, టీ20 వరల్డ్‌కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్‌తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]
చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment