
యాషెస్ సిరీస్‌లో రెండో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. దీంతో హాజల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్‌సన్‌ను ఎంపిక చేశారు. కాగా రెండేళ్ల తర్వాత రిచర్డ్‌సన్‌కు టెస్ట్ జట్టులో తిరిగి చోటు దక్కింది. తొలి టెస్ట్‌లో జోష్ హాజల్‌వుడ్ మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
బ్రిస్బేన్ వేదికగా జరగిన తొలి టెస్ట్‌లో కూడా గాయంతోనే హాజల్‌వుడ్ ఆడినట్లు తెలుస్తోంది. ఇక తొలి టెస్ట్‌లో ఘన విజయంతో యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ప్రస్తుతం అసీస్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో అధిక్యంలో ఉంది. అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 16న ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment