యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావియస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు అతడు దూరమయ్యాడు. శుక్రవారం హెడ్‌కి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా తెలినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో, తన భార్యతో కలిసి మెల్‌బోర్న్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు.
కాగా ప్రతిష్టాత్మాక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా హెడ్ ఉన్నాడు. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 248 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది.
చదవండి: Quinton De Kock/ IND Vs SA: భారత్‌తో ఓటమి.. డికాక్ సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment