సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కళ్లు చెమర్చే బంతితో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే ఆ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు బాల్ ఆఫ్ ది సమ్మర్, బాల్ ఆఫ్‌ది యాషెస్, బాల్ ఆఫ్‌ది 21వ సెంచరీ, బాల్ ఆఫ్ ది మిలినియమ్ అంటూ పేర్లు పెడుతున్నారు. అయితే ఈ దిగ్గజ బౌలర్ మాత్రం ఆ బంతిని ‘జఫ్ఫా’ అని పిలుస్తానని ట్వీట్ చేశాడు.
‘ఆ బంతిని నేను మాత్రం జఫ్ఫా అని పిలుస్తా.! ఏం బంతేసినవ్ స్టార్క్.. నీ ప్రదర్శన నా బౌలింగ్ రోజులను గుర్తుచేసింది. దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నీ ప్రదర్శనతో ఎడమ చేతి బౌలర్లను తలెత్తుకునేలా చేశావు!’ అని పేర్కొన్నాడు.
That’s called a JAFFA! What a delivery @mstarc56 you reminded me of my bowling days and I enjoyed it to the hilt! You made left armers proud! @CricketAus
— Wasim Akram (@wasimakramlive) 17 December 2017
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్ విన్స్‌ను స్టన్నింగ్ బంతితో పెవిలియన్ చేర్చాడు. గంటకు143.9 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి ఒక్కసారిగా 40 సెంటీమీటర్ల మేర రివర్స్ స్వింగ్ అయి జేమ్‌విన్స్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. దీంతో జేమ్‌విన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు ఏం జరిగిందో తెలియకుండా క్రీజును వదిలాడు.
Comments
Please login to add a commentAdd a comment