
లండన్: ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు యాషెస్ సిరీస్‌లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో స్టోక్స్‌కు అవకాశం లభించింది. స్టోక్స్ గత ఆదివారం తప్పతాగి ఓ వ్యక్తిని చితకబాది జైలుపాలైన విషయం తెలిసిందే.
కోచింగ్ క్యాంప్‌కు హాజరుకాలేదని స్టోక్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విండీస్‌తో నాలుగో వన్డేకు దూరం పెట్టింది. దీంతో తరువాతి మ్యాచ్‌లకు స్టోక్స్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్‌పై కనికరం చూపించింది. నేరం రుజువైతే మాత్రం స్టోక్స్‌కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం 5 ఏళ్ల జైలు శిక్షపడనుంది.