
అడిలైడ్: ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో రెండు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డే నైట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 81 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు వాతావరణం సహకరించలేదు. వర్షం కారణంగా తొలి సెషన్‌లో 13.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో... ఆదిలోనే వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌కు నిరాశే మిగిలింది. రెండో సెషన్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ బెన్‌క్రాఫ్ట్ (10) రనౌట్ రూపంలో వెనుదిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (47; 5 ఫోర్లు), ఉస్మాన్ ఖాజా (53; 8 ఫోర్లు)తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
34వ ఓవర్లో పేస్ బౌలర్ వోక్స్ ఈ జోడీని విడదీశాడు. వోక్స్ వేసిన పదునైన అవుట్ స్వింగర్‌ను ఆడటంలో విఫలమైన వార్నర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్‌లో ఖాజా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (40; 3 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. తొలి టెస్ట్ ఆడుతున్న ఓవెర్టన్‌కు వికెట్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆట ముగిసే సమయానికి హ్యాండ్స్‌కోంబ్ (36 బ్యాటింగ్), షాన్ మార్‡్ష (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment