
అడిలైడ్: చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పుంజుకొని సిరీస్‌ను గెల్చుకొని 63 ఏళ్లయింది. ఈసారీ ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్టులో ఓడిపోయింది. బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పాత రికార్డులను పట్టించుకోకుండా రెండో టెస్టులో తేరుకోవాలని, ఆతిథ్య జట్టుకు గట్టిపోటీ ఇవ్వాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టుతో జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు శనివారం మొదలయ్యే రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. డే నైట్‌గా జరిగే ఈ టెస్టులో పింక్ బంతిని ఉపయోగిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ఈ మ్యాచ్ సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment