విజయం దిశగా ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ ఆశలు ఆవిరి! | England facing second Test defeat after Joe Root falls in final over of day four | Sakshi
Sakshi News home page

Ashes 2021-22 second Test: విజయం దిశగా ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ ఆశలు ఆవిరి!

Published Mon, Dec 20 2021 8:42 AM | Last Updated on Mon, Dec 20 2021 8:42 AM

England facing second Test defeat after Joe Root falls in final over of day four - Sakshi

అడిలైడ్‌: యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్‌ విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 468 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 43.2 ఓవర్లలో 4 వికెట్లకు 82 పరుగులు చేసింది. బర్న్స్‌ (34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆటకు నేడు చివరి రోజు.

మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలంటే ఇంగ్లండ్‌ ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 45/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 61 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. మార్నస్‌ లబుషేన్‌ (51; 6 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (51; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. 
చదవండి: Yash Dhull: ఎవరీ యశ్‌ దుల్‌.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement