యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటికే వరసుగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఇంగ్లండ్ సిరీస్‌ను చేజార్చుకుంది. దీంతో రూట్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ అసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కావద్దని అతడు సూచించాడు. ఇంగ్లండ్ టీమ్ మెనేజ్‌మెంట్ వెంటనే జట్టు వైఫల్యాలపై చర్చించి మార్పులతో ముందుకు వెళ్లాలని అథర్టన్ తెలిపాడు. అదే విధంగా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా రూట్ స్ధానంలో బెన్ స్టోక్స్‌ని నియమించాలని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని అథర్టన్ పేర్కొన్నాడు.
"ఇంగ్లండ్ జట్టులో చాలా మంది ఆటగాళ్లకి ఏడంకెల జీతం ఈసీబీ చెల్లిస్తుంది. కానీ ఐపీఎల్ సమయంలో రెండు నెలలపాటు ఈసీబీ వారి సేవలను కోల్పోతుంది. ఐపిఎల్,ఇతర ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడనికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈసీబీ ఎందకు ఇస్తుందో నాకు అర్ధం కావడం లేదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈసీబీ నిర్ణయాలు తీసుకుంటే బాగుటుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎట్టి పరిస్ధితుల్లో దూరం కావద్దు" అని అతడు పేర్కొన్నాడు. కాగా జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, మోయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు.
చదవండి: SA vsIND: "టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఇది అద్భుతమైన నిర్ణయం"
Comments
Please login to add a commentAdd a comment