Cricekt Fans Troll Rory Burns For Continuos Failure Ashes 2021... ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ దారుణ ఆటతీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విషయంలోకి వెళితే.. యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఏదో పొరపాటు జరిగిందని సరిపెట్టుకుంటే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆ టెస్టు ఓడిపోవడం జరిగిపోయింది.
చదవండి: Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్
ఇక అడిలైడ్ వేదికగా మొదలైన పింక్‌బాల్ టెస్టు ద్వారా అయినా బర్న్స్ గాడిన పడతాడనుకున్నారు. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పైగా ఈసారి బర్న్స్‌కు జతగా మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఫెయిలయ్యాడు. ఆస్ట్రేలియా 473 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగులు మాత్రమే చేసిన బర్న్స్ మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఆరు పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల నుంచి కత్తుల్లా దూసుకొస్తున్న వేళ.. బ్యాడ్‌లైట్ కారణంగా ఆట తొందరగా ముగించడంతో ఇంగ్లండ్ బతికిపోయింది.
అయితే రోరీ బర్న్స్‌పై అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. తొలి టెస్టులో విఫలమయ్యావు.. కనీసం రెండో టెస్టుకు గాడినపడతావనుకున్నా.. పద్దతి మార్చుకోలేదు.. పింక్ బాల్ టెస్టులోనూ అదే ఆటతీరు.. ఇక నువ్వ మారవా అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ మూడో రోజు ఆటలో కాస్త నిలదొక్కుంది. ఓపెనర్లు ఔటైన తర్వాత కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మలాన్( 73 బ్యాటింగ్) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం
Rory Burns every time he bats pic.twitter.com/NgBD08JW4O
— Greggs and Tomelettes (@hknighthoe) December 17, 2021
Rory Burns in the changing room: pic.twitter.com/bFh3gEkuj9
— Cricket Mate 🏏 (@CricketMate_) December 17, 2021
Comments
Please login to add a commentAdd a comment