Rory Burns
-
పింక్ బాల్ టెస్టులోనూ అదే ఆటతీరు.. నువ్వు మారవా!
Cricekt Fans Troll Rory Burns For Continuos Failure Ashes 2021... ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ దారుణ ఆటతీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విషయంలోకి వెళితే.. యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఏదో పొరపాటు జరిగిందని సరిపెట్టుకుంటే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆ టెస్టు ఓడిపోవడం జరిగిపోయింది. చదవండి: Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్ ఇక అడిలైడ్ వేదికగా మొదలైన పింక్‌బాల్ టెస్టు ద్వారా అయినా బర్న్స్ గాడిన పడతాడనుకున్నారు. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పైగా ఈసారి బర్న్స్‌కు జతగా మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఫెయిలయ్యాడు. ఆస్ట్రేలియా 473 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగులు మాత్రమే చేసిన బర్న్స్ మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా ఆరు పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల నుంచి కత్తుల్లా దూసుకొస్తున్న వేళ.. బ్యాడ్‌లైట్ కారణంగా ఆట తొందరగా ముగించడంతో ఇంగ్లండ్ బతికిపోయింది. అయితే రోరీ బర్న్స్‌పై అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. తొలి టెస్టులో విఫలమయ్యావు.. కనీసం రెండో టెస్టుకు గాడినపడతావనుకున్నా.. పద్దతి మార్చుకోలేదు.. పింక్ బాల్ టెస్టులోనూ అదే ఆటతీరు.. ఇక నువ్వ మారవా అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ మూడో రోజు ఆటలో కాస్త నిలదొక్కుంది. ఓపెనర్లు ఔటైన తర్వాత కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మలాన్( 73 బ్యాటింగ్) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం Rory Burns every time he bats pic.twitter.com/NgBD08JW4O — Greggs and Tomelettes (@hknighthoe) December 17, 2021 Rory Burns in the changing room: pic.twitter.com/bFh3gEkuj9 — Cricket Mate 🏏 (@CricketMate_) December 17, 2021 -
టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్ లాథమ్ (30), నీల్ వాగ్నర్ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటలో ఒక్కరోజే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, వరణుడి దెబ్బకు మూడో రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 111/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపాడు. సౌథీకి మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) తోడవ్వడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) అద్భుత శతకానికి, కెప్టెన్ జో రూట్ (42), ఓలీ రాబిన్సన్ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరితో పాటు ఇంగ్లండ్ జట్టులో ఓలీ పోప్(22), స్టువర్ట్ బ్రాడ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 10 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం కివీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. జూన్ 18న ఇరు జట్లు సౌతాంప్టన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన పోరులో తలపడనున్నాయి. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
మహిళా క్రికెటర్‌తో ట్వీటర్ క్లాష్: ఈసీబీ వార్నింగ్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ రోరీ బర్న్స్‌కు ఈసీబీ వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్లీ సరదాగా చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న బర్న్స్ అందుకు ఆమెతో ట్వీటర్ వేదికగా వాదనకు దిగాడు. దీనిపై ఈసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్ చేసిన ట్వీట్‌పై అంతలా స్పందించాల్సిన అవసరం లేదని బర్న్స్‌కు తెలిపింది. ఈ క్రమంలోనే అతనికి మందలింపుతో సరిపెట్టింది. ఈ తరహా ఘటనలు మళ్లీ రిపీట్ కాకూడదని భారత్ పర్యటనలో ఉన్న ఆ జట్టు మేనేజ్మెంట్కు స్పష్టం చేసింది. దాంతో బర్న్స్ ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించాడు. ఇక్కడ చదవండి: కీలకమైన నాల్గో టెస్టుకు బుమ్రా దూరం వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్ మహిళలు, న్యూజిలాండ్ మహిళల మధ్య జరిగిన సెకండ్ వన్డేను ఉద్దేశించి అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ బెడిసి కొట్టింది. ‘బాగుంది అబ్బాయిలు.. న్యూజిలాండ్ మహిళల మ్యాచ్ ప్రారంభానికి ముందే టెస్ట్ మ్యాచ్‌ను పూర్తి చేయడం బాగుంది'అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై రోరీ బర్న్స్ సైతం తీవ్ర అభంతరం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్‌కు మద్దతు లభించేందుకు తాము ఓడిపోవాలనుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నాడు. ‘అబ్బాయిలందరూ మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది నిరాశపరిచే వైఖరి'అంటూ హార్ట్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఇక రోరీ బర్న్స్ ట్వీట్‌ను బెన్ స్టోక్స్‌తో సహ జేమ్స్ అండర్సన్ లైక్ చేయడం గమనార్హం. భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన మ్యాచ్ మరుసటిరోజు ఇంకా పూర్తి కాకుండానే ముగిసింది. కాగా, ఇంగ్లండ్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఇంకా వన్డే మిగిలి ఉండగానే ఇంగ్లండ్ మహిళల జట్టు కైవసం చేసుకుంది. -
అతన్ని ఎదుర్కోవడం కష్టమే
చెన్నై: ఇటీవల టీమిండియా పేస్ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్ గడ్డపై ఈసారి తమకు సీమ్ పిచ్‌లు ఎదురవుతాయని ఆశిస్తున్నట్లు ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ అన్నాడు. సాధారణంగా భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్లే ఉంటాయి. కానీ గత కొంత కాలంగా భారత సీమర్లు కూడా స్పిన్నర్లకు దీటుగా మ్యాచ్‌ల్ని భారత్ వైపు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బర్న్స్ మీడియా సమావేశంలో పిచ్‌ల సంగతి ప్రస్తావించాడు. శ్రీలంకపై 2–0తో గెలిచినప్పటికీ సొంతగడ్డపై భారత్‌తో పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. భారత శిబిరంలో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ సీమర్ అని, అతన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నాడు. 30 ఏళ్ల బర్న్స్ శ్రీలంకతో జరిగిన సిరీస్ ఆడలేదు. మరోవైపు భారత క్రికెటర్లందరూ తమ తొలి కోవిడ్ పరీక్షలో నెగిటివ్‌గా తేలారని ప్రకటించిన బీసీసీఐ... క్వారంటైన్లో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఉండేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఇంటర్నేషనల్ ప్యానెల్ అంపైర్లతో... భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఎలైట్ ప్యానెల్లో ఉన్న నితిన్ మీనన్‌తో పాటు తొలి టెస్టుకు అనిల్ చౌదరి, రెండో టెస్టుకు వీరేందర్ శర్మ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. అనిల్, వీరేందర్‌లు ఈ సిరీస్ ద్వారా టెస్టు అంపైర్లుగా అరంగేట్రం చేయనున్నారు. నిజానికి వీరిద్దరు ప్రస్తుతం ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానెల్లో మాత్రమే ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో తటస్థ అంపైర్లను నియమించడం కష్టంగా మారడంతో వివిధ సిరీస్‌ల సమయంలో స్థానిక అంపైర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. తొలి టెస్టుకు హైదరాబాద్‌కు చెందిన సి.శంషుద్దీన్ థర్డ్ అంపైర్‌గా పని చేస్తారు. చదవండి: అరంగేట్రంలోనే ‘5’ వికెట్లు పడగొట్టాడు! బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?