సిడ్నీ వేదికగా జరుగుతన్న యాషెస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగాడు. 140 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లతో 103 పరుగులు సాధించి ఆజేయంగా ఉన్నాడు. కాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరుపున బెయిర్‌స్టో తొలి సెంచరీ సాధించాడు. 13-0 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ హమీద్ వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత 36 పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో స్టోక్స్‌తో కలిసి బెయిర్‌స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, గ్రీన్, లియాన్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే!
ఆట సాగిందిలా...
సిడ్నీ: ‘సున్నా’ పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు... ఒకదశలో స్కోరు 36/4... వరుసగా 70 బంతుల పాటు సింగిల్ కూడా రాలేదు... ‘యాషెస్’లో ఈ స్థితి చూస్తే ఆస్ట్రేలియా చేతిలో మరో ఘోర పరాజయానికి ఇంగ్లండ్ బాటలు వేసుకున్నట్లు అనిపించింది. అయితే అద్భుత సెంచరీతో జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 103 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అతనికి తోడుగా బెన్ స్టోక్స్ (91 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు.
ముఖ్యంగా మూడేళ్ల తర్వాత సాధించిన శతకంతో బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ను రక్షించడంతో పాటు జట్టులో తన స్థానాన్ని కూడా కాపాడుకున్నా డు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు 65 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నిం గ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. బెయిర్‌స్టోతో పాటు లీచ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా ప్రస్తుతం ఆ జట్టు 158 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 13/0తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అదే తడబాటును ప్రదర్శించింది. హమీద్ (6)ను స్టార్క్ వెనక్కి పంపగా... 36 పరుగుల స్కోరు వద్దే క్రాలీ (18), రూట్ (0), మలాన్ (0) అవుటయ్యారు. ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 9 పరుగుల వద్ద స్టోక్స్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కమిన్స్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత 16 పరుగుల వద్ద స్టోక్స్‌కు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది.
గ్రీన్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లినా బెయిల్స్ పడలేదు! ముందు ఎల్బీ కోసం ఆసీస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూలో ప్యాడ్‌కు బంతి తగల్లేదని, స్టంప్స్ పైభాగంలో తగిలి వెళ్లిందని తేలడంతో స్టోక్స్ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఎట్టకేలకు 128 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత స్టోక్స్‌ను లయన్ అవుట్ చేయగా, బట్లర్ (0) విఫలమయ్యాడు. అనంతరం వుడ్ (39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ఫాలోఆన్‌ను కూడా తప్పించుకుంది. ఆ తర్వాత 138 బంతుల్లో బెయిర్ స్టో తన కెరీర్‌లో ఏడో సెంచరీని అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment