Yash Dhull U19 World Cup: అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్‌కు చేరింది. ఆంటిగ్వా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించారు. యష్ ధుల్ సెంచరీ(114)తో చెలరేగగా, షేక్ రషీద్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 37 పరుగులకే రెండు వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది.
ఆనంతరం యష్ ధుల్, షేక్ రషీద్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 194 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లు సాధించగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దటీజ్ యశ్ ధుల్
న్యూఢిల్లీకి చెందిన యశ్ దుల్‌కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించాడు. ఇక ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడీసీఈ(ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్‌లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. అదే విధంగా ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించిన యశ్ ధుల్.... జట్టును చాంపియన్‌గా నిలిపాడు.
యశ్ కెప్టెన్సీలో భారత యువ జట్టు ఫైనల్లో శ్రీలంకను 9 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. ఇక ఇప్పుడు ఐసీసీ మేజర్ టోర్నీ వరల్డ్‌కప్‌లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చి కెప్టెన్‌గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో 110 బంతుల్లో 110 పరుగులు సాధించి బ్యాటర్‌గానూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా!
Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు!
Comments
Please login to add a commentAdd a comment