స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా పాకిస్తాన్- ఆసీస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహించనున్నాడు.
అదే విధంగా యువ పేసర్ లాన్స్ మోరిస్‌కు చోటు దక్కింది. అంతేకాకుండా గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ తిరిగి వచ్చాడు. లియోన్ తిరిగి రావడంతో యవ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి తొలి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ టెస్టు సిరీస్‌కు కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
పాకిస్థాన్ టెస్టు జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ షా అఫ్రిది
చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment