ఆసీస్ భారీ స్కోరు: కివీస్ ఎదురీత | austarlia declared at 556 runs and lose 4 wickets | Sakshi
Sakshi News home page

ఆసీస్ భారీ స్కోరు: కివీస్ ఎదురీత

Published Fri, Nov 6 2015 4:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

ఆసీస్ భారీ స్కోరు: కివీస్ ఎదురీత

ఆసీస్ భారీ స్కోరు: కివీస్ ఎదురీత

బ్రిస్బేన్:  మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు నమోదు చేసింది. 389/2 ఓవర్ నైట్ స్కోరు రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 556 పరుగుల వద్ద ఉండగా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  అనంతర బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ వరుసగా కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీలు 45 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులతో ఎదురీదుతున్నారు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్ (47) ఫర్వాలేదనిపించగా, మార్టిన్ గుప్తిల్(23),  బ్రెండన్ మెకల్లమ్(6), రాస్ టేలర్(0), నిషామ్(3), వాట్లింగ్(14) లు నిరాశపరిచారు. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్(55 బ్యాటింగ్), వాట్లింగ్(14)క్రీజ్ లో ఉన్నారు.ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, జాన్సన్ లు తలో రెండు వికెట్లు సాధించగా, హజల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది.  అంతకుముందు డేవిడ్ వార్నర్ (163), ఉస్మాన్ ఖాజా  (174)లు సెంచరీలతో చెలరేగడంతో పాటు, స్టీవ్ స్మిత్(48), వోజస్(83), బర్న్స్ (71) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement