టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్ నివాళులర్పించాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్‌లో ఎప్పటికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్.. వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
"షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. షేన్ నా హీరో. అతడితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్రతీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు.
ఇక కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంతరం అతడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో కుల్దీప్ బీజీబీజీగా గడపనున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కుల్దీప్‌ది కీలక పాత్ర.
Comments
Please login to add a commentAdd a comment