టీ20 వరల్డ్‌కప్-2024లో- దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తోంది.
ఈ బ్లాక్‌బ్లాస్టర్ క్లాష్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఐర్లాండ్‌పై విజయం సాధించి సమరోత్సహంతో భారత్ బరిలోకి దిగనుండగా.. పసికూన చేతిలో ఓడిన పాక్ మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అతడి స్ధానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. న్యూయర్క్ వికెట్ స్పిన్‌కు అనుకూలించడంతో పాటు పాక్‌పై కుల్దీప్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఈ క్రమంలోనే అతడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. అదే విధంగా కుల్దీప్ కూడా ఇటీవల అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఒక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
మరోవైపు పాకిస్తాన్ కూడా ఓ మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ స్ధానంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
Comments
Please login to add a commentAdd a comment