టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌పై భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో భారత బౌలర్లు అద్బుతంగా రాణించారు.
120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. అయితే లక్ష్య చేధనలో పాకిస్తాన్ భారత్ కంటే మెరుగ్గానే ఆడింది. 14 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో భారత ఓటమి లాంఛనమే అని అంతా ఫిక్స్ అయిపోయాడు.
బుమ్ బుమ్ బుమ్రా..
అప్పుడు ఎటాక్‌లో వచ్చాడు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా. తన సెకెండ్ స్పెల్‌తో మ్యాచ్ స్వరూపాన్నే బుమ్రా మార్చేశాడు. 15 ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతికే అద్బుతమైన డెలివరీతో డేంజరస్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రిజ్వాన్.. క్రాస్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి లో బౌన్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అస్సలు బంతి అంతలా లో బౌన్స్ అవుతుందని రిజ్వాన్ ఊహించలేకపోయాడు.
దీంతో ఒక్కసారిగా రిజ్వాన్ సైతం ఆశ్చర్యపోయాడు. 31 పరుగులు చేసిన రిజ్వాన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజ్వాన్ వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.
అనంతరం తిరిగి 19వ ఓవర్ వేసిన బుమ్రా.. కేవలం 3 పరుగులిచ్చి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగుల కావాల్సిన నేపథ్యంలో పాకిస్తాన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 3 వికెట్లు పడగొట్టి 14 పరుగులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment