ఏమి చేస్తున్నావు కుల్దీప్‌.. రోహిత్ శ‌ర్మ సీరియ‌స్‌! వీడియో వైర‌ల్‌ | Rohit Sharma’s stump mic gem as Kuldeep Yadav frustrates him with his bowling | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఏమి చేస్తున్నావు కుల్దీప్‌.. రోహిత్ శ‌ర్మ సీరియ‌స్‌! వీడియో వైర‌ల్‌

Published Sun, Jun 23 2024 9:08 AM | Last Updated on Sun, Jun 23 2024 10:28 AM

Rohit Sharmas stump mic gem as Kuldeep Yadav frustrates him with his bowling

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో సెమీఫైన‌ల్‌కు చేరేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో సూప‌ర్‌-8లో భాగంగా అంటిగ్వా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్‌.. గ్రూపు-1  నుంచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 196 ప‌రుగుల భారీ స్కోర్ చేసిన భార‌త్‌.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో ప్ర‌త్య‌ర్ధిని 146 ప‌రుగులకే క‌ట్ట‌డి చేసింది. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా(50), విరాట్ కోహ్లి(37), రిష‌బ్ పంత్‌(36), శివ‌మ్ దూబే(34) ప‌రుగుల‌తో రాణించ‌గా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు.  

కుల్దీప్‌పై రోహిత్ అస‌హ‌నం..
ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్న‌ర్ కుల్దీప్‌ యాద‌వ్‌పై భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవ‌ర్ వేసిన కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో తొలి బంతిని షకీబ్ అల్ హసన్ భారీ సిక్స్ బాదాడు. 

ఆ త‌ర్వాత రెండో బంతికి ష‌కీబ్ రివ‌ర్స్ స్వీప్ ఆడి త‌న వికెట్‌ను కోల్పోయాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన మ‌హ్ముదుల్లాకు కుల్దీప్ గుగ్లీగా సంధించాడు. అయితే మ‌హ్ముదుల్లాకు గుగ్లీ వేయ‌డం రోహిత్‌కు న‌చ్చ‌లేదు. 

వెంట‌నే రోహిత్‌.. ఏమి చేస్తున్నావు కుల్దీప్‌,  అత‌డికి స్వీప్ ఆడ‌నివ్వు. ఒకరు స్వీప్ ఆడి ఇప్పుడే ఔట‌య్యాడు. కాబ‌ట్టి అత‌డు స్వీప్ ఆడేట్లు బౌలింగ్ చేయు అని చెప్పాడు. ఇదింతా స్టంప్‌ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement