భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చాలా స్పెషల్‌.. అంతే ఒత్తడి కూడా: బాబర్‌ | Babar Azam on India-Pakistan high intensity clashes | Sakshi

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చాలా స్పెషల్‌.. అంతే ఒత్తడి కూడా: బాబర్‌

Jun 2 2024 5:42 PM | Updated on Jun 2 2024 7:28 PM

 Babar Azam on India-Pakistan high intensity clashes

వరల్డ్‌క్రికెట్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మద్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య.. గత కొన్నేళ్ల నుంచి ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడతునున్నాయి.

దీంతో చిరకాల ప్రత్యర్ధిలు ఎప్పుడెప్పుడూ తలపడతారా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణ ఫలించే సమయం అసన్నమైంది. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా జూన్‌ 9న న్యూయర్క్‌ వేదికగా పాక్‌-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు క్రేజ్‌ ఉందని బాబర్‌ తెలిపాడు.

"భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ రెండు జట్లు తలపడతున్నాయంటే అందరి దృష్టి ఆ మ్యాచ్‌పైనే ఉంటాయి. ప్రపంచంలో నలుమూలులా ఈ మ్యాచ్‌ గురించి మాట్లాడుకుంటారు. ఈ మ్యాచ్‌ అంటే చాలు ఇరు జట్ల ఆటగాళ్లలో తెలియని ఉత్సాహం, తెలియని ఉత్సాహం వచ్చేస్తాయి. 

ప్రతీ ఒక్క ఆటగాడు తమ జట్టును ఎలాగైనా గెలిపించేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తారు. అందుకే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగే రోజు కోసం అతృతగా ఎదురుచూస్తారు. అంతే ఒత్తడి ఇరు జట్లపైనే కూడా ఉంటుంది. కానీ మేము ఏకగ్రాతను కోల్పోకుండా ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నిస్తాముని" పీసీబీ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement