యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. ఆసీస్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టును మరుపురాని విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఖ్వాజా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఆసీస్, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు, ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం బిగ్ షాకిచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మేయింటన్ చేసినందుకు ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 40 శాతం కొత విధించింది. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా ఉన్నాయని నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. ప్రతీ ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించబడుతుంది. 2 రెండు ఓవర్లు ఆలస్యమైంది కాబట్టి 40 శాతం జరిమానా విధించారు.
అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ప్రతీ ఓవర్ లేటుకు వారి డబ్ల్యూటీసీ పాయింట్లలో ఒక పాయింట్ కొత విధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇరు జట్లు చెరో రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయాయి.
చదవండి: ICC CWC Qualifier 2023: అమెరికాకు మరో బిగ్ షాక్.. నేపాల్ సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment