పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా జట్టు.. 1998 తర్వాత ఇప్పుడే.. | Australia Set tour Pakistan for all format series in March 2022 | Sakshi
Sakshi News home page

ఎన్నో పర్యటనలు రద్దు.. 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా జట్టు

Published Mon, Nov 8 2021 4:20 PM | Last Updated on Mon, Nov 8 2021 5:43 PM

Australia Set tour Pakistan for all format series in March 2022 - Sakshi

Australia set for first tour of Pakistan in 24 years: 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం (నవంబర్ 8) వెల్లడించింది. ఈ సిరీస్‌ కరాచీలో జరగబోయే మొదటి టెస్ట్‌తో ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్‌ రావల్పిండిలో, మూడో టెస్ట్‌తో పాటు మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ లాహోర్‌లో జరగనున్నాయి.

1998లో పాకిస్తాన్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా చివరిసారిగా 1998లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అనేక సార్లు పాక్‌ పర్యటను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. 2002 పాకిస్తాన్‌లో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా..  కరాచీలో ఆత్మాహుతి బాంబు దాడితో ఆ పర్యటను రద్దు చేసుకుంది. అదే విధంగా 2008లో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మకమైన ఘటనల నేపథ్యంలో పర్యటను మరోసారి రద్దు చేసుకుంది.

2009లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి
ఆ తర్వాత  2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడంతో.. ఏ జట్టు కూడా పాకిస్తాన్‌లో పర్యటించడానికి సాహసం చేయలేదు. ఇటీవలి కాలంలో శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్టులు పాకిస్తాన్‌లో పర్యటించాయి. దీంతో మరోసారి ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల సందడి మొదలైంది. 

కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ని కూడా ఆ దేశ క్రికెట్‌ బోర్డు విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ లీగ్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు  పాల్గొంటున్నారు. మరో వైపు  భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్లు పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు ఆస్ట్రేలియా ఆమోదం తెలపడం గమనార్హం

చదవండి: Sanju Samson: రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌: జట్టును వీడనున్న సంజూ శాంసన్.. సీఎస్‌కేకు!?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement