ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నిపింది. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్.. ఇక లేడన్న వార్తను అతడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన 15 ఏళ్ల కేరిర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట వార్న్ లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్‌లో కూడా వార్న్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆరంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ సారథ్యం వహించాడు. తొలి సీజన్‌లో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండానే యువకులతో బరిలోకి దిగిన రాజస్తాన్.. తొలి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడడంలో షేన్ వార్న్‌దే కీలక పాత్ర. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం. అంతేకాకుండా రీటైర్డ్ అయ్యిన తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా వార్న్ రికార్డు సృష్టించాడు. 2008 ఐపీఎల్ వేలంలో వార్న్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
చదవండి: PAK Vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్
Comments
Please login to add a commentAdd a comment