ICC Test Rankings: Australia becomes World No. 1 after EPIC Edgbaston Triumph - Sakshi
Sakshi News home page

ICC Test Rankings: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. టెస్టుల్లో నెంబర్‌ వన్‌ జట్టుగా ఆస్ట్రేలియా!

Published Wed, Jun 21 2023 12:24 PM

Australia becomes World No 1 after EPIC Edgbaston Triumph - Sakshi

టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్‌ వన్‌ జట్టుగా అవతరించనుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్‌.. టీమిండియాను వెనుక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను కైవసం చేసుకోనుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌  121 పాయింట్లతో అగ్ర స్ధానంలో ఉండగా.. ఆసీస్‌ 116 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది.

అయితే  ఇంగ్లండ్‌పై విజయం సాధించడంతో ఆసీస్‌ ఖాతాలో అదనంగా పాయింట్లు వచ్చి చేరున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను ఆస్ట్రేలియా అధిగమించే ఛాన్స్‌ ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ఇంకా టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్‌ చేయలేదు. ఐసీసీ చివరగా మే3న  టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్‌ చేసింది. కాగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియాదే తొలి విజయం. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో ఆసీస్‌ 12 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కీలక సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఉస్మాన్ ఖవాజా (65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్డ్ 3, ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. శుబ్‌మన్‌ గిల్‌కు నో ఛాన్స్‌! రుత్‌రాజ్‌ రీ ఎంట్రీ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement